
ఖైరతాబాద్, వెలుగు: సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి-2న ‘రన్ఫర్ఏ గర్ల్ చైల్డ్’ తొమ్మిదో ఎడిషన్నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్చంద్రశేఖర్ రెడ్డి, సేవా భారతి ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమలత, సంయుక్త కార్యదర్శి జయప్రద దేవి, స్వప్న, ప్రసన్న కాంత్పాల్గొని మాట్లాడారు.
సేవా భారతి వార్షిక నిధుల సేకరణలో భాగంగా వచ్చే ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలోని ఆర్చరీ గ్రౌండ్లో రన్ఫర్ఏ గర్ల్‌చైల్డ్ నిర్వహిస్తున్నామన్నారు. 21కె,10కె,5కె రన్ఉంటాయన్నారు. ముఖ్య అతిథిలుగా ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా రన్టీషర్ట్స్ ను ఆవిష్కరించారు. రన్లో పాల్గొనాలనుకుంటే 98480 34767లో సంప్రదించాలని చెప్పారు.